న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పై పోరాటానికి కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. ఎంపీ ల్యాడ్స్ నుంచి ఈ మొత్తాన్ని ప్రధాని నేషనల్ రిలీఫ్ ఫండ్ (పీఎంఎన్‌ఆర్ఎఫ్)కు అందజేశారు. 'ఇప్పుడే ఈ మొత్తాన్ని డిపాజిట్ చేశాను. కరోనా వ్యాధిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు బీజేపీ ఎంపీలంతా ఎంపీ ల్యాడ్స్ నుంచి పీఎంఎన్ఆర్ఎఫ్‌కు విరాళం ఇవ్వాలని ప్రధాని పిలుపు మేరకు ఈ మొత్తం డిపాజిట్ చేశాను' అని కిరిణ్ రిజిజు ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.
కోవిడ్-19పై ప్రభుత్వ పోరాటానికి మరింత బలం చేకూర్చేందుకు ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఒక నెల వేతనాన్ని పీఎంఎన్ఆర్ఎఫ్‌కు శుక్రవారంనాడు విరాళంగా ప్రకటించారు.

