Monday, 14 Jun, 5.32 pm ఆంధ్రజ్యోతి

తెలంగాణ తాజావార్తలు
ఎంపీ నిధులను మున్సిపల్ ఎజెండాలో పెట్టడంపై ఉత్తమ్‌ తీవ్ర అభ్యంతరం

సూర్యాపేట: ఎంపీ నిధులను మున్సిపల్ ఎజెండాలో పెట్టడంపై టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సోమవారం హుజూర్ నగర్ మున్సిపాలిటీ సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈసమావేశంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఎమర్జెన్సీ పేరిట మున్సిపల్ నిధులను తీర్మానం లేకుండా.. జిల్లా కలెక్టర్ వినియోగించడం కౌన్సిల్ అధికారాన్ని నాశనం చేయడమేనని తప్పుబట్టారు. నిందితులపై పీడీ యాక్ట్ పెడతామన్న ప్రభుత్వం అధికార పార్టీ పెద్దమనుషులను పోలీస్ స్టేషన్‌కు కూడా పిలవడం లేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు.

నకిలీ విత్తనాలపై సీఎం కేసీఆర్ ప్రకటనలకే పరిమితమయ్యారన్నారు. హుజూర్‌నగర్‌ నకిలీ విత్తనాల కేసులో నిందితులను.. వెంటనే అరెస్ట్ చేయకపోతే పెద్దఎత్తున ఆందోళన చేపడతామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ.. 57 అంశాల ఎజెండాతో జరిగిన కౌన్సిల్ సమావేశంలో అన్ని అంశాలపై తీర్మానాలు చేయడం జరిగిందన్నారు. దుమ్ములేని హుజూర్‌నగర్‌ను త్వరలోనే అందిస్తామని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తెలిపారు.

హుజూర్‌నగర్ మున్సిపాలిటీ సమావేశం రసా భాస

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
Top