హైదరాబాద్, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): జన్యు సంబంధిత వ్యాధుల గుర్తింపు, నిర్ధారణ, నివారణ, చికిత్సకు సంబంధించి జాతీయ వైద్య మండలి ఎండీ మెడికల్ జెనెటిక్స్ అనే కొత్త కోర్సును ప్రవేశపెట్టింది. ఈ మేరకు బుధవారం ఆ కోర్సుకు సంబంధించిన వివరాలను తన అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. మూడేళ్ల వ్యవధి గల ఈ కోర్సు చేయాలంటే జనరల్ మెడిసిన్, గైనకాలజిస్టు, పిడియాట్రిక్స్ వైద్యులు అర్హులని తెలిపింది. ఈ కొత్త కోర్సుకు కూడా జాతీయ అర్హత పరీక్ష ద్వారానే సీట్ల భర్తీ ఉంటుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ కోర్సు అందుబాటులోకి రానుంది.