Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎంఎంటీఎస్‌ రైళ్లకు ఏసీ కోచ్‌లు!

ఎంఎంటీఎస్‌ రైళ్లకు ఏసీ కోచ్‌లు!

  • ప్రతిపాదనలు పంపాలని రైల్వేబోర్డు నుంచి ఆదేశాలు

  • ప్రణాళికలు సిద్ధం చేస్తున్న దక్షిణ మధ్య రైల్వే

  • 2027 ఏప్రిల్‌ వరకు అందుబాటులోకి వచ్చే అవకాశం

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌ నగరంలోని వివిధ ప్రాంతాలను కలుపుతున్న లోకల్‌ (ఎంఎంఎటీఎస్‌) రైళ్లలో ఏసీ కోచ్‌లు ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ సన్నద్ధమైంది.

ముంబై, చెన్నై, కోల్‌కతా నగరాల్లో ఇటీవల ప్రవేశపెట్టిన ఏసీ లోకల్‌ రైళ్ల మాదిరిగా, హైదరాబాద్‌ మహానగరంలో నడిచే ఎంఎంఎటీఎస్‌ రైళ్లకు ఏసీ కోచ్‌లను జత చేసేందుకు చర్యలు తీసుకుంటోంది.

రైల్వేబోర్డు నుంచి అందిన ఆదేశాల మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలను రూపొందిస్తోంది. తొలిదశలో ఒక్కో ఎంఎంటీఎ్‌సకు 2 నుంచి 4వరకు ఏసీ కోచ్‌లను జతచేయడం, రెండోదశలో సంపూర్ణంగా కొత్త ఏసీ రైళ్లను నడపడం వంటి అంశాలపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఏసీ కోచ్‌లకు డిమాండ్‌ పెరగడంతో మూడు (ఐసీఎఫ్‌, ఆర్‌సీఎఫ్‌, ఎంసీఎఫ్‌) రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీల్లో వందల సంఖ్యలో లోకల్‌ రైళ్ల ఏసీ కోచ్‌ల తయారీకి రైల్వేబోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

 వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి..

2027 ఏప్రిల్‌కల్లా దేశంలోని వివిధ కోచ్‌ ఫ్యాక్టరీల నుంచి పెద్దసంఖ్యలో లోకల్‌ రైళ్లకు ఏసీ కోచ్‌లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఉందానగర్‌ నుంచి ఆర్సీపురం వరకు, లింగంపల్లి నుంచి హైదరాబాద్‌కు, కాచిగూడ నుంచి మేడ్చల్‌ వరకు, ఘట్‌కేసర్‌ నుంచి లింగంపల్లి వరకు సుమారు 70 ఎంఎంటీఎస్‌ రైళ్లు నడుస్తుండగా, ప్రతిరోజూ 60వేలమంది ప్రయాణాలు సాగిస్తున్నారు. మరోవైపు, ఘట్‌కేసర్‌ నుంచి యాదాద్రివరకు ఎంఎంటీఎస్‌ రెండోదశ ప్రాజెక్టు విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి.

ఎంఎంటీఎస్‌ రైళ్లలో ఏసీ కోచ్‌ల సదుపాయం అందుబాటులోకి వస్తే ఐటీ కారిడార్‌లో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్‌, కార్పొరేట్‌ ఉద్యోగులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని టెక్కీ నాగరాజు తెలిపారు. మరోవైపు ఎంఎంటీఎస్‌ సేవలను పటాన్‌చెరు మీదుగా సంగారెడ్డి వరకు విస్తరించాలనే బీజేపీ ఎంపీల డిమాండ్‌ను కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకునే పక్షంలో మరిన్ని కొత్త(ఏసీ) ఎంఎంటీఎస్‌ రైళ్లను రైల్వేబోర్డు మంజూరు చేసే అవకాశం ఉందని రైల్వే ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy