Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎంఎస్ ధోని బర్త్ డే.. బీసీసీఐ స్పెషల్ విషెస్!

ఎంఎస్ ధోని బర్త్ డే.. బీసీసీఐ స్పెషల్ విషెస్!

ఇంటర్నెట్ డెస్క్: 538 అంతర్జాతీయ మ్యాచ్‌లు.. 17,266 పరుగులు.. 829 స్టంపింగ్స్.. కెప్టెన్‌గా మూడు ఐసీసీ ట్రోఫీలు.. రాంచీ వీధుల నుంచి ప్రపంచ క్రికెట్‌ను శాసించే వరకు ఎదిగిన కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని పుట్టిన రోజు నేడు.

టికెట్ కలెక్టర్ స్థాయి నుంచి దేశానికి ట్రోఫీలు అందించే వరకు.. మాహీ ప్రస్థానం అద్వితీయం! 45వ పడిలోకి అడుగుపెడుతున్న ధోనికి బీసీసీఐ స్పెషల్ విషెస్ చెప్పింది. క్రికెట్ ఐకాన్ అంటూ అభివర్ణిస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది.

వేగానికి పెట్టింది పేరు..

ఎంఎస్ ధోని వికెట్ల వెనుక ఉన్నాడంటే ప్రత్యర్థి బ్యాటర్లకు వణుకే. కళ్లు మూసి తెరిచేంతలో స్టంపింగ్ చేయడంలో ధోని దిట్ట. క్రికెట్‌లో సాధారణంగా కెప్టెన్లు తీవ్రమైన ఒత్తిడిలో ఉంటారు. కానీ ధోని ఎప్పుడూ ఒత్తిడిలో కనిపించలేదు. మైదానంలో కూల్ అండ్ కామ్‌గా ఉంటూ సారథిగా సరైన నిర్ణయాలు తీసుకునేవాడు. అందుకే అతడికి 'కెప్టెన్ కూల్' అనే బిరుదు వచ్చింది. ధోని హెలికాప్టర్ షాట్లకు ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. అతడి బ్యాటింగ్ చూడటం కోసం అభిమానులు ఇప్పటికీ ఎదురుచూస్తుంటారు.

వచ్చే ఐపీఎల్‌లో అయినా ఆడతాడా?

చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ధోని.. ఐపీఎల్ 2026లో బరిలోకి దిగని సంగతి తెలిసిందే. అలాగని అతడు రిటైర్‌మెంట్ ప్రకటించలేదు. గాయం కారణంగా ప్రారంభ మ్యాచ్‌లకు దూరమైన తలా.. ఆ తర్వాత యువ ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఐపీఎల్ ఆడలేదు. అతడిని మైదానంలో చూడాలని ఆశపడ్డ అభిమానులకు ఈ సీజన్‌లో నిరాశే మిగిలింది. వచ్చే ఏడాదైనా ధోని బరిలోకి దిగుతాడా? అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

అందరినీ అనుమానించొద్దు: ధోని

ధోని పుట్టినరోజు సందర్భంగా ఆయన గతంలో చెప్పిన ఓ విషయం నెట్టింట వైరల్ అవుతోంది. 'జీవితంలో మీకు మంచి వ్యక్తులు ఎదురవుతారు.. చెడు వ్యక్తులూ ఎదురవుతారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఒకరు మీ నమ్మకాన్ని వమ్ము చేశారని అందరినీ నమ్మడం మానేయకండి. అలాంటి సంఘటనల నుంచి పాఠం నేర్చుకుని ముందుకు సాగాలి. జీవితమంతా మనకు ఆనందాన్ని ఇచ్చే, మన ప్రయాణంలో భాగమయ్యే కొద్ది మంది మంచి వ్యక్తులను కనుగొనడమే అసలు ప్రయాణం' అని ఓ ఇంటర్వ్యూలో ధోని వెల్లడించాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy