Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ఎంఎస్‌ఎన్‌ ఫార్మా ఔషధానికి ఎఫ్‌డీఏ గ్రీన్‌ సిగ్నల్‌

హైదరాబాద్‌ కేంద్రంగా పని చేసే ఎంఎ్‌సఎన్‌ గ్రూపు అమెరికా మార్కెట్‌లో మరో కొత్త జనరిక్‌ ఔషధాన్ని విడుదల చేయబోతోంది. ఇందుకోసం సమర్పించిన అబ్రివేటెడ్‌ న్యూ డ్రగ్‌ అప్లికేషన్‌(అండా)కు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ తుది ఆమోదం లభించింది. ఈ అండాస్‌ ఆధారంగా ఎంఎ్‌సఎన్‌ గ్రూపు, అసేనాపిన్‌ సబ్‌లింగ్యుయల్‌ అనే టాబ్లెట్లను 5 ఎంజీ మోతాదులో తయారు చేసి అమెరికా మార్కెట్‌లో విడుదల చేస్తుంది. వీటిని మనోవైకల్య, తీవ్ర మనోవైకల్య సమస్యల చికిత్సలో ఉపయోగిస్తారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy