ఆంధ్ర ప్రదేశ ముఖ్యాంశాలు
ఎన్నికల నిర్వహణకు సహకరించండి
సీఎస్‌కు మరోసారి నిమ్మగడ్డ లేఖ
అమరావతి, నవంబర్ 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ సోమవారం మరోసారి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి లేఖ రాశారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని ఎస్ఈసీ రెండు దఫాలుగా చేసిన ప్రయత్నాలకు ప్రభుత్వం గండి కొట్టింది. ప్రభుత్వానికి ఎస్ఈసీ లేఖ రాసినప్పటికీ కరోనా సెకండ్ వేవ్ ఉందంటూ సీఎస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ మరోసారి నిమ్మగడ్డ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించాలని ఆ లేఖలో కోరారు.