Dailyhunt
ఎన్నికల నియమాళి ఉల్లంఘన కేసులో మంత్రి తలసాని నిర్ధోషిగా తీర్పు

ఎన్నికల నియమాళి ఉల్లంఘన కేసులో మంత్రి తలసాని నిర్ధోషిగా తీర్పు

హైదరాబాద్: రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు మరి కొందరిపై మోపిన కేసులో సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా పేర్కొంటూ నాంపల్లి 2 వ సెషన్ కోర్టులో ఎంపి, ఎంఎల్ఏ కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానం సోమవారం విచారణ అనంతరం తీర్పునిచ్చింది. తలసాని శ్రీనివాస్ యాదవ్ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది ఆదూరి చిన్న శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం 2020 సంవత్సరం లో పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళికి విరుద్దంగా ప్రచారం నిర్వహించారని గోపాలపురం పోలీసులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంఎల్సీ లు స్టీఫెన్ సన్, రాజేశ్వరరావు, ఎంపి అభ్యర్ధి తలసాని సాయి కిరణ్ యాదవ్, అప్పటి మోండా మార్కెట్ కార్పొరేటర్ ఆకుల రూప లపై 171/C, 171/E, 188 సెక్షన్ ల క్రింద కేసు నమోదు చేశారు.

పూర్వాపరాలు విచారించిన నాంపల్లి 2 వ సెషన్ కోర్టులో ఎంపి, ఎంఎల్ఏల కేసుల విచారణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోర్టు సోమవారం విచారణ అనంతరం సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు కేసులో పేర్కొన్న వారందరిని నిర్దోషులుగా పేర్కొంటూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వరప్రసాద్ తీర్పునిచ్చారు. మంత్రి తరపున న్యాయవాదులు ఆదూరి చిన్న శ్రీనివాస్, అన్నపూర్ణ లు వాదించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy