Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎన్‌టీఏ డైరెక్టర్‌గా ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి ప్రసన్న వెంకటేశ్..

ఎన్‌టీఏ డైరెక్టర్‌గా ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి ప్రసన్న వెంకటేశ్..

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు చెందిన 2012 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి వి.ప్రసన్న వెంకటేశ్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) డైరెక్టర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది.

సెంట్రల్‌ స్టాఫింగ్‌ స్కీమ్‌ కింద ఆయన ఐదేళ్లపాటు ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ (DoPT) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో పలు కీలక బాధ్యతలను ప్రసన్న వెంకటేశ్ గతంలో నిర్వహించారు. ఏలూరు జిల్లా కలెక్టర్‌గా, విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేశారు. పరిపాలనలో తనదైన ముద్ర వేసిన ఆయనకు తాజాగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో కీలకమైన ఎన్‌టీఏ డైరెక్టర్‌ బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇకపై దేశవ్యాప్తంగా వివిధ ప్రవేశ, అర్హత పరీక్షలను నిర్వహించే నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీకి ఆయన నాయకత్వం వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఏపీ కేడర్‌ అధికారికి మరో కీలక కేంద్ర బాధ్యత లభించినట్లు అయ్యింది.

ఈ వార్తలు కూడా చదవండి

ఎంతటివారితోనైనా అనైతిక పనులు చేయించగల మూర్ఖుడు జగన్: మంత్రి పార్థసారథి

ఏపీ ప్రజలందరికీ రాఖీ శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy