అమరావతి, మే2 (ఆంధ్రజ్యోతి): వేసవిలో ఎంత డిమాండ్ ఉన్నా విద్యుత్ కోతలు ఉండటానికి వీల్లేదని ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Minister Gottipati Ravi Kumar) అధికారులకు స్పష్టం చేశారు.
అకాల వర్షాలు, అధిక వేడి వల్ల తాత్కాలిక కరెంట్ సమస్యలు తలెత్తిన్నా వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు. ఈరోజు (శనివారం) విద్యుత్ సీఎండీలతో మంత్రి గొట్టిపాటి టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారికంగా లేదా అనధికారికంగా ఏపీలో ఎక్కడా కరెంట్ కోతలు ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు.
సాంకేతిక సమస్యలు తలెత్తి విద్యుత్ కోతలు విధించాల్సి వస్తే ప్రజలకు ఆ సమాచారం చెప్పటంతో పాటు వెంటనే సమస్య పరిష్కరించేలా చూడాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. వేసవి డిమాండ్‌కు తగ్గట్లుగా సరిపడా కరెంట్ అందుబాటులో ఉన్నా అక్కడక్కడా ఫిర్యాదులు ఎందుకు వస్తున్నాయని మంత్రి ఆరా తీశారు. అధిక ఉష్ణోగ్రతలతో పలుచోట్ల ట్రాన్స్‌ఫార్మర్‌లు కాలిపోవటం, అకాల వర్షాల వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులు వివరించారు. ప్రజలు ఇబ్బంది పడకుండా ఆయా సమస్యల పరిష్కారానికి సిబ్బంది అందుబాటులో ఉంటూ పూర్తి అప్రమత్తంగా ఉండాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు.
.
జగన్‌కు మానసిక సమస్య ఉంది.. సీఎం సెటైర్లు
శ్రామికులే దేశ అభివృద్ధికి బలం: మంత్రి నారా లోకేశ్
Read Latest AP News And Telangana News And International News And Telugu News

