Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీలో మరో రెండు రోజులపాటు వర్షాలు.. ప్రధాన పోర్టులకు IMD హెచ్చరిక..

ఏపీలో మరో రెండు రోజులపాటు వర్షాలు.. ప్రధాన పోర్టులకు IMD హెచ్చరిక..

ఇంటర్‌నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల రాబోయే రెండు రోజుల పాటు భారీ వర్షాలు.. మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడిందని, కోస్తాలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రధాన పోర్టులకు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసింది.

రాబోయే రెండు రోజుల పాటు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో రాబోయే ఐదు రోజుల పాటు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఐఎండీ హెచ్చరికలు..

సముద్రం అలజడిగా మారే అవకాశం ఉన్నందున కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం రేవులలో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. జూలై 4వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. ఇక, రాయలసీమ జిల్లాల్లో ఐదు రోజుల పాటు అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరించింది.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీల ఖరారు.. జులై 20 నుంచి మొదలు..

మమతకు మరో షాక్.. రాజీనామా చేసిన పార్టీ ప్రెసిడెంట్ చంద్రిమా భట్టాచార్య

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy