Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

ఏప్రిల్‌ 7 నుంచి ఐసెట్‌ దరఖాస్తుల స్వీకరణ

హైదరాబాద్‌/కేయూ క్యాంపస్‌, మార్చి 3(ఆంధ్రజ్యోతి): ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్‌ షెడ్యూల్‌ విడుదలైంది. బుధవారం టీఎ్‌సఐసెట్‌ కమిటీ తొలి సమావేశం వర్చువల్‌ పద్ధతిలో జరిగింది. కేయూ వీసీ బి.జనార్దన్‌ రెడ్డి, ఐసెట్‌ కన్వీనర్‌ కె.రాజిరెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఏప్రిల్‌ 3న ఐసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల, ఏప్రిల్‌ 7 నుంచి జూన్‌ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని కన్వీనర్‌ తెలిపారు. దరఖాస్తు రుసుము రూ.650గా నిర్ణయించామని, పరీక్ష సీబీటీ విధానంలో మూడు విడతల్లో ఉంటుందన్నారు. తెలంగాణ, ఏపీల్లో 14 ఆన్‌లైన్‌ సెంటర్లలో ఆగస్టులో పరీక్ష ఉంటుందని కన్వీనర్‌ తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy