Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎర్రటి ఎండలో ఉత్సాహంగా సైకిల్ తొక్కిన సీఎం చంద్రబాబు

ఎర్రటి ఎండలో ఉత్సాహంగా సైకిల్ తొక్కిన సీఎం చంద్రబాబు

విశాఖపట్నం, జూన్ 5: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్సాహంగా సైకిల్ తొక్కారు. ఐదున్నర కిలో మీటర్ల దూరాన్ని 21 నిమిషాల 18 సెకండ్లలో చేరుకున్నారు.

విశాఖ ఏయూ గ్రౌండ్స్ నుంచి నోవాటెల్‌ వరకు సీఎం సైకిల్ సవారీ చేశారు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్, పోలమాంబ గుడి, వాల్తేరు, బీచ్ రోడ్ మీదుగా నోవాటెల్‌కు ముఖ్యమంత్రి చేరుకున్నారు. ఎర్రటి ఎండ కాస్తున్నా ఉత్సాహంగా సైకిల్ తొక్కారు. సైకిల్ తొక్కుతూ ప్రజలకు అభివాదం చేసుకుంటూ సీఎం సైకిల్ ప్రయాణం సాగింది. సైకిల్ ర్యాలీలో సీఎం చంద్రబాబు వెంట జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజలు ఉన్నారు.

సీ ఫుడ్స్ ఎగుమతులపై వర్క్‌షాప్

విశాఖలో సీ ఫుడ్స్ ఎగుమతులపై జాతీయ స్థాయి వర్క్‌షాప్ ప్రారంభమైంది. ఈ వర్క్‌షాప్‌కు హాజరైన చంద్రబాబు.. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మంత్రులు రాజీవ్ రంజన్ సింగ్, రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాశ్వాన్, మంత్రులు అచ్చెన్నాయుడు, డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ బీద మస్తాన్ రావు.. వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు.


ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే సైకిల్ తొక్కాలి: రామ్మోహన్ నాయుడు

మొక్కలు పెంచే వాళ్లకే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు.. సీఎం సరదా వ్యాఖ్యలు

Read Latest AP News And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy