Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎస్‌ఐ కదా అని అడిగిన వెంటనే లిఫ్ట్ ఇస్తే.. షాకింగ్ వీడియో వైరల్

ఎస్‌ఐ కదా అని అడిగిన వెంటనే లిఫ్ట్ ఇస్తే.. షాకింగ్ వీడియో వైరల్

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఒక ఎస్‌ఐ తాజాగా సస్పెన్షన్‌కు గురయ్యారు. తన ట్రక్‌లోని రూ.20 వేలను ఎస్‌ఐ చోరీ చేశాడని ఒక డ్రైవర్ ఆరోపించిన నేపథ్యంలో ఆయనపై వేటు పడింది.

ట్రక్ డ్రైవర్, ఎస్‌ఐ ఇద్దరూ నడిరోడ్డుపై ఘర్షణ పడుతున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. హమీర్‌పూర్ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది.

ట్రక్ డ్రైవర్ చెప్పిన వివరాల ప్రకారం, హమీపూర్ మీదుగా వెళుతున్న సమయంలో ఎస్ఐ లిఫ్ట్ అడిగారు. కొంత దూరం వెళ్లాక ఒక టోల్ ప్లాజా వద్ద ఎస్‌ఐ దిగిపోయారు. తన వ్యక్తిగత వాహనంలో ఎక్కి వెళ్లిపోయారు. ఆ తరువాత కొంత దూరం వెళ్లాక ట్రక్ డ్రైవర్ తన వద్ద ఉండాల్సిన రూ.20 వేలు మాయమైన విషయాన్ని గుర్తించారు.

ఎస్‌ఐపై అనుమానం రావడంతో వెనక్కు మళ్లి ఆయన వాహనాన్ని వెంబడించారు. దాదాపు 13 కిలోమీటర్ల వెంబడించాక ఎస్‌ఐని అడ్డగించి నడిరోడ్డు మీద నిలదీశారు. ఎస్ఐ వద్ద తన రూ.20 వేలు లభించిందని కూడా చెప్పారు. ఎస్ఐ కాలర్ పట్టుకుని ట్రక్ డ్రైవర్ నిలదీస్తున్న వీడియో నెట్టింట వైరల్ కావడంతో విషయం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది.

ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. ట్రక్ డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌ఐని తక్షణం సస్పెండ్ చేశామని చెప్పారు. డిపార్ట్‌మెంటల్ ఎంక్వైరీ కూడా ప్రారంభమైందని అన్నారు. దర్యాప్తు అనంతరం తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఈ వార్తలనూ చదవండి:

బెంగళూరు-మైసూర్ హైవేపై దారుణం.. కారు అడ్డు పెట్టి కుటుంబంపై దాడి.. వీడియో వైరల్

రాత్రంతా తలుపు హ్యాండిల్‌పై కింగ్ కోబ్రా.. ఇంట్లోనే బందీ అయిన కుటుంబం..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy