Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎయిరిండియా సీఈఓగా టెవోల్డె జెబ్రెమరియం

ఎయిరిండియా సీఈఓగా టెవోల్డె జెబ్రెమరియం

న్యూఢిల్లీ/ముంబై: టాటా గ్రూప్‌ నిర్వహణలోని ఎయిరిండియా సీఈఓ, ఎండీగా టెవోల్డె జెబ్రెమరియం నియమితులయ్యారు. టాటా గ్రూప్‌ మాతృసంస్థ టాటా సన్స్‌ బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.

ఇథియోపియన్‌ ఎయిర్‌లైన్స్‌ గ్రూప్‌ మాజీ చీఫ్‌ అయిన టెవోల్డె.. ఆ సంస్థను విస్తరించి లాభాల బాట పట్టించడంలో కీలక పాత్ర వహించారు. ఇథియోపియన్‌ జాతీయుడైన టెవోల్డె నేతృత్వంలో ఎయిర్‌ ఇండియా విస్తరణ, అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందని భావిస్తున్నట్టు టాటా గ్రూప్‌ ప్రకటించింది. అయితే టెవోల్డె నియామకం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే విషయాన్ని ఎయిరిండియా వెల్లడించలేదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రస్తుతం సీఈఓగా ఉన్న క్యాంప్‌బెల్‌ విల్సన్‌ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించటంతో ఆయన స్థానంలో టెవోల్డోను టాటా గ్రూప్‌ నియమించింది.

ఇవీ చదవండి:

ఎన్‌డీఏ సమావేశానికి ముగ్గురు రెబల్ ఎంపీల గైర్హాజరు.. సువేందు విందుకు హాజరు

'మూడు రోజుల్లో క్షమాపణ చెప్పాలి'.. మెటాకు పార్లమెంట్ అల్టిమేటం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy