Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫాస్ట్‌గా ఉండాలి..అమెరికా కార్ల కంపెనీలపై ఫైరైన ట్రంప్

ఫాస్ట్‌గా ఉండాలి..అమెరికా కార్ల కంపెనీలపై ఫైరైన ట్రంప్

వాషింగ్టన్: కరోనా మహమ్మారి అమెరికాకు పెద్ద సవాలునే విసురుతోంది. కరోనాను అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు అవసర మవడంతో ఈ దిశగా అగ్రరాజ్యం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. రోగుల ట్రీట్‌మెంట్‌కు అవసరమైన టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్లు, ఇతరత్రా సామాగ్రిని యుద్ధ ప్రాతిపదికన అమర్చుకుంటోంది. వెంటిలేటర్ల తయారీకి ప్రైవేటు రంగం సహాయాన్ని కూడా తీసుకుంటోంది. ముఖ్యంగా ప్రముఖ కార్ల తయారీ సంస్థలైన ఫోర్డ్, జనరల్ మోటార్స్‌లు నిరుపయోగంగా పడి ఉన్న తమ తయారీ కేంద్రాలలో వెంటిలేటర్ల తయారు చేసేందుకు ముందుకు వచ్చాయి. అయితే అనుకున్నంత వేగంగా వెంటిలేటర్ల తయారీ ముందుకు వెళ్లకపోవడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రాహానికి గురయ్యారు.

ట్విటర్ వేదికగా ఆయా సంస్థలపై మండిపడ్డారు. వెంటనే రంగంలోకి దిగి.. పరికరాల తయారీని వేగవంతం చేయాలని కాస్త ఘాటుగా చెప్పారు.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy