- సాక్ష్యులతో విచారణ పూర్తి
- వివరాలు వెల్లడించిన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ మల్లారెడ్డి
ఆదిలాబాద్(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సమత అత్యాచా రం, హత్య కేసుకు సంబంధించిన చార్జీషీటును కొ మరంభీం ఆసిఫాబాద్ జిల్లా పోలీసులు శనివారం ఆదిలాబాద్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో దాఖలు చేశారు. స్వయంగా ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ మల్లారెడ్డి, దర్యాప్తు అధికారి డీఎస్పీ సత్యనారాయణ కోర్టుకు హాజరై చార్జీషీటును దాఖలు చేశారు. నిందితులపై 302, 376 (డీ) సెక్షన్లతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసి టీ కేసులను నమోదు చేసినట్లు తెలిపారు.
అలాగే ఫోరెన్సిక్, డీఎన్‌ఏ రిపోర్టులను చార్జీషీటులో పొందుపర్చారు. గతనెల 24వ తేదీన ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం ఎల్లాపటార్ గ్రామ శివారులో సమతను ముగ్గురు దుండగులు అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన తెలిసిందే. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆదిలాబాద్‌లో ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పా టుచేసి కేసును అప్పగించింది. ఈకేసులో ఇప్పటికే ముగ్గురు ప్రధాన నిందితులను అరెస్టు చేసి అదు పులోకి తీసుకున్న పోలీసులు మరో 44మంది సాక్ష్యులను విచారించి చార్జీషీటులో చేర్చారు.
ఈ కేసు విచారణ త్వరితగతిన పూర్తికావడానికి అన్ని సా క్ష్యాధారాలను అందజేయనున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఈకేసుకు నంబరింగ్ చేసిన అనంతరం సోమ వారం నుంచి విచారణ ప్రారంభమవుతుందని, నిత్యం ఐదుగురు సాక్ష్యుల చొప్పున నిందితులను విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిందితులను త్వరలోనే కోర్టులో హాజరుపర్చి అన్ని సాక్ష్యా ధారాలను పరిశీలించిన అనంతరం దోషులకు కఠిన శిక్షపడే అవకాశం ఉందని ఆదిలాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రమణారెడ్డి తెలిపారు. ఈ యేడాదిలోనే నిందితులకు శిక్షపడేలా న్యాయస్థానం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

