Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫైనల్: సునామీ ఇన్నింగ్స్.. లంక బౌలర్లను వేటాడిన వైభవ్!

ఫైనల్: సునామీ ఇన్నింగ్స్.. లంక బౌలర్లను వేటాడిన వైభవ్!

ఇంటర్నెట్ డెస్క్: ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా దంబుల్లా వేదికగా ఫైనల్ పోరులో శ్రీలంక-ఎ, భారత్-ఎ జట్లు తలపడుతున్నాయి. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ..

రివేంజ్ మోడ్‌లో ఇన్నింగ్స్ ఆడాడు. గత మ్యాచ్‌లో శ్రీలంక ప్లేయర్లు రెచ్చగొట్టడంతో వైభవ్ ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లంక బౌలర్లపై వైభవ్ ప్రతీకారం తీర్చుకున్నాడు. 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన వైభవ్.. లిస్ట్-ఎ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు సాధించాడు. 29 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్స్‌లు, 324 స్ట్రైక్ రేట్‌తో 94 పరుగులు చేశాడు. త్రుటిలో సెంచరీ మిస్ అయినప్పటికీ చేయాల్సిన విధ్వంసం చేసి పెవిలియన్ చేరాడు.

ఈ ట్రై సిరీస్‌లో వైభవ్ లీగ్ స్టేజ్ మ్యాచుల్లో విఫలమవుతూ వచ్చాడు. ఆఖరి లీగ్‌లో లంకపై సూపర్ ఓవర్లో భారత్-ఎ ఓటమి చవి చూసింది. ఆ మ్యాచ్ ముగిసిన తర్వాతే శ్రీలంక ప్లేయర్లు, వైభవ్ సూర్యవంశీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తనను రెచ్చగొట్టినందుకు శ్రీలంక బౌలర్లను నిర్దాక్షిణ్యంగా బాదేసి ప్రతీకారం తీర్చుకున్నాడు. వేసిన ప్రతి బంతీ బ్యాట్‌ను తాకి బౌండరీ వైపు దూసుకెళ్లింది. లీగ్ అయినా, ఇంటర్నేషనల్ అయినా తన బ్యాట్ పవర్ తగ్గలేదని వైభవ్ మరోసారి నిరూపించాడు.


వైభవ్ ప్రవర్తనపై విమర్శలు.. తిలక్ వర్మ రియాక్షన్ ఇదే

ఫిఫా ప్రపంచ కప్: ఐవరీ కోస్ట్‌పై విజయం.. నాకౌట్‌కు జర్మనీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy