Dailyhunt
ఫలించని ఏపీ ప్రభుత్వ లాయర్ల ప్రయత్నాలు

ఫలించని ఏపీ ప్రభుత్వ లాయర్ల ప్రయత్నాలు

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై రేపు కూడా విచారణ జరిగే అవకాశం కనిపించడం లేదు. రాజధాని, సీఆర్డీఏ రద్దు చట్టంపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. ఆగస్ట్ 4న సీఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణ చట్టంపై ఏపీ హైకోర్టు స్టేటస్ కో విధించింది. సుప్రీంకోర్టులో విచారణకు ఏపీ ప్రభుత్వం తరపు లాయర్లు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే.. ఏపీ ప్రభుత్వ లాయర్ల ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నెల 17న ఏపీ ప్రభుత్వం పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారించనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy