న్యూఢిల్లీ: పురుషుల 'ఫెయిర్ అండ్ లవ్లీ' పేరును 'గ్లో అండ్ లవ్‌లీ'గా మార్చడంపై సౌందర్య సాధనాల తయారీ సంస్థలు హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్(హెచ్‌యూఎల్), ఇమామీల మధ్య చిచ్చురేగింది. 'గ్లో అండ్ హ్యాండ్‌సమ్' పేరు తమ ప్రొడక్ట్స్‌ను పోలి వున్నందున హెచ్‌యూఎల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ ఇమామీ హెచ్చరించింది. హెచ్‌యూఎల్ కంటే ముందే తాము ఉత్పత్తి చేస్తున్న పురుషుల ఫెయిర్‌నెస్ క్రీమ్‌కు 'ఇమామీ గ్లో అండ్ హ్యాండ్‌సమ్' అని పేరు పెట్టినట్టు ఇమామీ చెబుతోంది. ''హెచ్‌యూఎల్ నిర్ణయంతో మాకు షాక్ అనిపించినప్పటికీ.. ఆ కంపెనీ చేసే అన్యాయమైన వ్యాపారం మాకు ఆశ్చర్యం కలిగించలేదు..'' అంటూ ఇమామీ తీవ్ర స్థాయిలో మండిపడింది.

