Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫిఫా ప్రపంచ కప్ 2026.. స్వీడన్‌పై ఫ్రాన్స్ ఘన విజయం

ఫిఫా ప్రపంచ కప్ 2026.. స్వీడన్‌పై ఫ్రాన్స్ ఘన విజయం

స్పోర్ట్స్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026లో నాకౌట్ మ్యాచులు ఎంతో ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఫేవరెట్ జట్లలో ఒకటైన ఫ్రాన్స్ అదరగొడుతోంది. తాజాగా జరిగిన మ్యాచ్ లో అద్భుత ప్రదర్శనతో ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది.

న్యూజెర్సీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో స్వీడన్ పై 3-0 తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ కిలియన్ ఎంబాపె అదిరిపోయే ప్రదర్శన చేశాడు. ఏకంగా రెండు గోల్స్ సాధించి... ఫ్రాన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

బలహీనంగా ఉన్న స్వీడిష్ జట్టుపై ఫ్రెంచ్ జట్టు ఆద్యంతం ఆధిపత్యం చెలాయించింది. బంతిని తమ ఆధీనంలో ఉంచుకోవడంలోనూ, గోల్ వైపు షాట్లు కొట్టడంలోనూ పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శించింది. ఎంబాపె 45వ నిమిషంలో తొలి గోల్ చేయడంతో ఫ్రాన్స్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత 53వ నిమిషంలో బర్కోలా గోల్ చేయడంతో 2-0తో ఫ్రెంచ్ జట్టు తిరుగులేని స్థితిలో నిల్చుంది. ఇక స్వీడన్ జట్టు గోల్ చేయడం కంటే.. ఆపేందుకే తీవ్రంగా ప్రయత్నించాల్సి వచ్చింది.

ఈ క్రమంలోనే ఎంబాపె 74వ నిమిషంలో వ్యక్తిగతంగా రెండో గోల్ చేయడంతో పాటు జట్టును 3-0 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. దీంతో ఫ్రెంచ్ జట్టు విజయం లాంఛనమైంది. ఫిఫా ప్రపంచకప్‌లో నాకౌట్ దశలో ఎంబాపె సాధించిన గోల్స్‌ సంఖ్య ఈ మ్యాచ్‌తో 10కి చేరింది. తద్వారా టోర్ని చరిత్రలో నాకౌట్‌ దశలో అత్యధిక గోల్స్ చేసిన బ్రెజిల్ దిగ్గజాలు లియోనిడాస్, రొనాల్డో నజారియో(8)ల రికార్డును అధిగమించాడు. అదేవిధంగా ఫిఫా వరల్డ్‌కప్‌ చరిత్రలో అత్యధిక గోల్స్‌ కొట్టిన అర్జెంటీనా స్టార్‌ ప్లేయర్‌ మెస్సి (19) రికార్డుకు ఒక గోల్‌ దూరంలో నిలిచాడు.

జర్మనీ 'సడన్‌ డెత్‌'

ఒత్తిడంతా భారత్‌పైనే..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy