Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫిఫా ప్రపంచ కప్: పెనాల్టీ షూటౌట్‌లో పరాగ్వే సంచలన విజయం

ఫిఫా ప్రపంచ కప్: పెనాల్టీ షూటౌట్‌లో పరాగ్వే సంచలన విజయం

ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ మాజీ ఛాంపియన్ జర్మనీకి భారీ షాక్ తగిలింది. రౌండ్ ఆఫ్ 32లో పరాగ్వేతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో జర్మనీ 3-4 తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

పెనాల్టీ షూటౌట్‌లో జర్మనీపై పరాగ్వే సంచలన విజయం నమోదు చేసింది. నిర్ణీత సమయంలోపు ఇరు జట్లు 1-1తో సమంగా నిలవడంతో పెనాల్టీ షూటౌట్ రౌండ్ నిర్వహించారు. అయితే ప్రపంచ కప్ చరిత్రలోనే తొలిసారిగా పెనాల్టీ షూటౌట్‌లో జర్మనీ పరాజయం పాలవ్వడం గమనార్హం.

తొలి అర్ధభాగంలో జూలియో ఎన్‌సిసో హెడ్డర్‌తో పరాగ్వేకు ఆధిక్యాన్ని అందించాడు. రెండో అర్ధభాగం 54వ నిమిషంలో జర్మనీ ప్లేయర్ కాయ్ హావెర్ట్జ్ గోల్ చేసి సమం చేశాడు. టోర్నీలో హావెర్ట్జ్‌కు ఇది మూడో గోల్. అదనపు సమయంలో జొనాథన్ తాహ్ చేసిన గోల్‌ను వీడియో అసిస్టెంట్ రిఫరీ (VAR) సమీక్ష చేసి ఫౌల్ కారణంగా రద్దు చేశారు. దీంతో మ్యాచ్ పెనాల్టీలకు వెళ్లింది. ఉత్కంఠభరితంగా సాగిన షూటౌట్‌లో పరాగ్వే గోల్‌కీపర్ ఓర్లాండో గిల్ అద్భుతంగా రాణించి హావెర్ట్జ్, నిక్ వోల్టెమాడే ప్రయత్నాలను అడ్డుకున్నాడు. మరోవైపు పరాగ్వే కూడా రెండు అవకాశాలను చేజార్చుకున్నా, చివరికి జోస్ కానాలే విజయవంతంగా పెనాల్టీని గోల్‌గా మలిచాడు. అదే సమయంలో తాహ్ తన గోల్‌ను బార్‌పైకి కొట్టడంతో జర్మనీ ఆశలు ఆవిరయ్యాయి.

2014లో ప్రపంచకప్ గెలిచిన తర్వాత నాకౌట్ దశలో పెద్దగా రాణించని జర్మనీకి ఇది మరో నిరాశాజనక ముగింపుగా నిలిచింది. మరోవైపు ప్రపంచ కప్ చరిత్రలోనే పరాగ్వేకు ఇది అత్యంత చిరస్మరణీయ విజయం. తదుపరి రౌండ్‌లో ఫ్రాన్స్-స్వీడన్ మ్యాచ్ విజేతతో పరాగ్వే తలపడనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy