Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫిఫా వరల్డ్‌కప్‌లో మొరాకో జోరు: ఇస్మాయిల్ సైబారి మెరుపు గోల్!

ఫిఫా వరల్డ్‌కప్‌లో మొరాకో జోరు: ఇస్మాయిల్ సైబారి మెరుపు గోల్!

స్పోర్ట్స్ డెస్క్: ఫుట్‌బాల్ ప్రపంచకప్‌2026లో మొరాకో జట్టు తమ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. గ్రూప్-సి లో భాగంగా శనివారం ఇక్కడ జరిగిన ఉత్కంఠభరిత పోరులో మొరాకో 1-0 తేడాతో స్కాట్లాండ్‌పై విజయం సాధించింది.

గత ప్రపంచకప్‌లో సెమీఫైనల్ చేరి సంచలనం సృష్టించిన మొరాకో.. ఈ మ్యాచ్‌లోనూ అదే దూకుడును ప్రదర్శించింది. బ్రెజిల్‌తో జరిగిన తొలి మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకున్న ఆ జట్టు.. ఈ విజయంతో నాకౌట్ దశకు అడుగు దూరంలో నిలిచింది.

మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే మొరాకో సంచలన గోల్ నమోదు చేసింది. ఆట మొదలైన కేవలం 71 సెకన్ల వ్యవధిలో మొరాకో ఆటగాడు ఇస్మాయిల్ సైబారి అద్భుతమైన గోల్‌తో జట్టుకు ఆధిక్యం అందించాడు. బ్రాహిమ్ డియాజ్ అందించిన పాస్‌ను స్కాట్లాండ్ డిఫెండర్ల కళ్లుగప్పి అందుకున్న సైబారి, బంతిని నేరుగా గోల్‌పోస్ట్ టాప్ లెఫ్ట్ కార్నర్‌లోకి పంపాడు. స్కాట్లాండ్ గోల్‌కీపర్ అంగస్ గన్ దీనిని నిలువరించలేకపోయాడు. ఈ ప్రపంచ కప్ అరంగేట్రం మ్యాచ్‌లో 21వ నిమిషంలోనే గోల్ కొట్టిన సైబారి.. తన రెండో మ్యాచ్‌లో 71 సెకన్లలోనే వేగంగా గోల్ సాధించడం విశేషం.

ఆ తర్వాత స్కాట్లాండ్ కోలుకోవడానికి ప్రయత్నించినప్పటికీ మొరాకో డిఫెన్స్ విభాగాన్ని ఛేదించలేకపోయింది. మ్యాచ్ మొత్తం మీద మొరాకో 12 సార్లు గోల్ కోసం ప్రయత్నించగా స్కాట్లాండ్ కేవలం 6 సార్లే షాట్లు కొట్టగలిగింది. చివర్లో ఆండీ రాబర్ట్‌సన్ ఇచ్చిన క్రాస్‌ను జాన్ మెక్‌గిన్ గోల్‌గా మలచడంలో విఫలం కావడంతో స్కాట్లాండ్‌కు నిరాశే మిగిలింది. ఈ ఓటమితో స్కాట్లాండ్ తదుపరి రౌండ్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. వచ్చే బుధవారం జరగబోయే తమ చివరి లీగ్ మ్యాచ్‌ల్లో స్కాట్లాండ్ జట్టు బలమైన బ్రెజిల్‌తో తలపడనుండగా.. మొరాకో జట్టు హైతీతో తలపడనుంది.

ఉత్కంఠ పోరులో న్యూజిలాండ్ విజయం.. సెమీస్ ఆశలు సజీవం!

40 ఏళ్ల తర్వాత..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy