స్పోర్ట్స్ డెస్క్: భారత మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (SuryaKumar Yadav) కొలంబో వెళ్లాడు. అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో శ్రీలంక క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య కూడా అదే ఈవెంట్ కు హాజరయ్యాడు.
దీంతో సూర్యకుమార్ యాదవ్ లంక సూర్యను కలిశాడు. వారి మధ్య చిన్నపాటి సంభాషణ జరిగింది. ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
'హాయ్ సర్.. మీరు చాలా ఫిట్‌గా కనిపిస్తున్నారు. ఏంటి.. క్రికెట్‌లోకి పునరాగమనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారా?. వందశాతం ఫిట్‌నెస్‌తో కనిపిస్తున్నారు' అని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. దీనికి సనత్ జయసూర్య నవ్వుతూ అలాంటిదేమీ లేనట్లుగా ప్రతిస్పందించాడు. ఈ స్టార్ క్రికెటర్ల మధ్య జరిగిన ఈ సంభాషణ వీడియో ఇరుదేశాల క్రికెట్ అభిమానుల మనసు గెలిచింది. ప్రస్తుతం శ్రీలంకలో భారత్ టెస్టు మ్యాచ్ ఆడుతున్న సంగతి తెలిసిందే.
2026 టీ20 ప్రపంచ కప్ టైటిల్‌ను భారత్‌కు అందించిన సూర్యకుమార్ బ్యాటింగ్‌లో పేలవ ప్రదర్శనతో అనేక విమర్శలు ఎదుర్కొన్నాడు. అంతేకాక ఇదే కారణంగా ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనకు ముందు టీ20 కెప్టెన్సీ కోల్పోయాడు. అంతేకాక ఏకంగా జట్టులోనే స్థానం కోల్పోయాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్‌కు సూర్య కుమార్ స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌ను కొత్త కెప్టెన్‌గా బీసీసీఐ నియమించింది.
strong>

