హైదరాబాద్: కరోనా సెకండ్‌వేవ్‌లో వైరస్ బారిన పడిన వారిలో 5శాతం మందికే లక్షణాలు కనపిస్తున్నాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ , ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు 100శాతం టీకాలు పంపిణీ చేస్తామని ఆయన వెల్లడించారు. ఆదివారం మంత్రి ఈటల మీడియాతో మాట్లాడుతూ ప్రతి పిహెచ్‌సిలో వ్యాక్సిన్ అందుబాటులో ఉండేలా చూస్తామని అన్నారు. ప్రస్తుతం రోజుకు లక్షన్నర మందికి వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వానికి రోఉకు 10లక్షల టీకాలు వేసే సామర్ధ్యం ఉందని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కోవిడ్ తాజా పరిస్థితిని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు.

