చిత్రజ్యోతి
గాడ్సే మరణ వాంగ్మూలం

''గాంధీ హత్య అనంతరం ఆయన కుమారుడు దేవదాస్ గాంధీ తిన్నగా పోలీస్ ేస్టషన్‌లో ఉన్న గాడ్సేను కలిసి ఈ హత్య వ్యక్తిగతమా? అని అడిగారు. గాడ్సే కాదని స్థిరంగా సమాధానమిచ్చారు. మరి గాంధీని బహిరంగంగా ప్రజల సమక్షంలో హత్యచేయ్యడం వెనక ఉన్న బలమైన తాత్విక చింతన ఏమిటి? అన్నదే ఈ సినిమా తీయడానికి ప్రేరేపించిన అంశం'' అని దర్శకుడు భరద్వాజ్ అన్నారు. ఆయన దర్శకత్వంలో గాడ్సే కథ ఆధారంగా 'మరణ వాంగ్మూలం' చిత్రం తెరకెక్కనుంది. సూరజ్ నిర్మాత. డిసెంబర్‌లో చిత్రీకరణ ప్రారంభిస్తారు. శుక్రవారం ఈ చిత్రం టైటిల్ పోస్టర్‌ను తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించారు. ''గాడ్సే రాసిన పుస్తకం అందరిని ఆలోచింపజేస్తుంది.
ఆయన కోర్ట్‌లో ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిశీలిేస్త ఆయన ఎందుకు ఆ పని చేశారో అర్థం అవుతుంది. గాడ్సే జనాల దృష్టిలో ఎందుకు విలన్ అయ్యాడు అన్న విషయాలు ఈ చిత్రంలో చెప్పబోతున్నారు'' అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ''డిసెంబర్‌లో షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తాం'' అని నిర్మాత సూరజ్ తెలిపారు.