అమరావతి, జులై 05: గల్లంతైన మత్స్యకారులను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల గురించి విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి ఆయన ఆరా తీశారు.
గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల వివరాలను ఈ సందర్భంగా ఆయన అడిగి తెలుసుకున్నారు. మత్స్యకారుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మెరైన్ పోలీసులు, కోస్ట్ గార్డు, నేవీ సమన్వయంతో ఈ గాలింపు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌కు సూచించారు.
నేవీ హెలికాప్టర్‌తో ఇప్పటికే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని డిప్యూటీ సీఎంకు విశాఖ జిల్లా కలెక్టర్ వివరించారు. సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని ఆయనను ఆదేశించారు. అలాగే మత్స్యశాఖ ఉన్నతాధికారులను కూడా ఈ సందర్భంగా ఆయన అప్రమత్తం చేశారు. మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయం ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించింది.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: మంత్రి తుమ్మల
ముంబైలో మరో దారుణం.. వీడియో వైరల్..
For More AP News And Telugu News

