హైదరాబాద్, సెప్టెంబర్ 3: గంజాయి డాన్ నీతు భాయ్ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించారు. ఈరోజు(గురువారం) ఉదయం మొత్తం ఎనిమిది చోట్ల సోదాలు చేపట్టారు.
నీతు భాయ్‌పై ఎక్సైజ్ శాఖ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ సోదాలు జరుపుతోంది. గంజాయి అమ్మకాలతో నీతు భాయ్ కోట్ల రూపాయలను సంపాదించినట్లు విచారణలో తేలింది. హవాలా రూపంలోనే ఈ డబ్బులు సంపాదించినట్లు ఈడీ గుర్తించింది. ప్రస్తుతం ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి.
స్నేహితులే కిడ్నాపర్లు.. నాని క్రికెట్ ప్రిడిక్షన్ యాప్ నిర్వాహకుడికి విముక్తి

