Dailyhunt
గన్నవరం ప్రభుత్వాస్పత్రి వద్ద ఉద్రిక్తత

గన్నవరం ప్రభుత్వాస్పత్రి వద్ద ఉద్రిక్తత

గన్నవరం: గన్నవరం ప్రభుత్వాస్పత్రి వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలవరం కాలువలో ప్రమాదవశాత్తు మునిగి ఇద్దరు గొర్రెల కాపరులు నిన్న చనిపోయారు. అయితే వీరిద్దరి మృతదేహాలకు పోస్టుమార్టం చేయకుండా గన్నవరం ప్రభుత్వాస్పత్రి వైద్యులు నిర్లక్ష్యం వహించారు. దీంతో మృతుల బంధువులు ఆస్పత్రి వద్ద ధర్నాకు దిగారు. తమ వారి మృతదేహాలను అప్పగించాలని నిరసన చేశారు. వీరి నిరసనతో జాతీయ రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy