నేడు యూఏఈతో భారత్ ‘ఎ’ మ్యాచ్
ఆసియాకప్ రైజింగ్ స్టార్స్
ఉ.11.30 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో..
దోహా: ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భారత్ ‘ఎ’ కీలక పోరుకు సిద్ధమవుతోంది.
సెమీఫైనల్స్ బెర్త్ లక్ష్యంగా మంగళవారం యూఏఈతో తలపడనుంది. గ్రూప్ ‘బి’ తొలి వన్డే మ్యాచ్‌లో నేపాల్‌ను చిత్తు చేసిన భారత్.. పాకిస్థాన్‌తో మాత్రం అన్ని విభాగాల్లో తేలిపోయింది. ముఖ్యంగా బౌలింగ్ తీరు ఆందోళనపరిచింది. ఇక, యూఏఈతో పోరులో బౌలింగ్ విభాగం మెరుగ్గా రాణిస్తేనే ఫలితం అనుకూలంగా ఉండవచ్చు.

