తెలంగాణ తాజావార్తలు
ఘనంగా ముగిసిన సేవాలాల్ జయంతి ఉత్సవాలు

జనగామ: జిల్లాలోని పాలకుర్తి మండల కేంద్రంలో భారీ ఎత్తున జరిగిన గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు సోమవారంతో ముగిశాయి. ఈ ఉత్సవాలకు జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో గిరిజనులు ఉత్సవాలకు హాజరయ్యారు. ముగింపు రోజున రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు ఉత్సవాలకు హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా మంత్రి గిరిజనులతో కలిసి ఆడిపాడారు. వారితో డాన్స్‌చేస్తూస్టెప్పులు వేయడంతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఈలలు,చప్పట్లతో అభినందించారు. గిరిజనులు ఎంతో ఆనందోత్సహాల మధ్య ఈ ఉత్సవాలు జరుపుకోవడం సంతోషకరమని ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.
Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
related stories
-
హోం ద్విచక్ర వాహనాల దొంగల ముఠా అరెస్ట్
-
జిల్లా వార్తలు వృద్ధులను ఆదరించాలి
-
కృష్ణ నిరాశ్రయులకు 25 కేజీల బియ్యం