గిరిజన రైతులపై దాడులకు పాల్పడుతున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డిని టీడీపీటీఎస్ అధ్యక్షుడు ఎల్.రమణ కోరారు. ఈ మేరకు డీజీపీని గురువారం కలిసి ఫిర్యాదు చేశారు. మఠంపల్లి మండలంలోని సర్వే నంబరు 540లోని 1,876ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న కొందరు.. గిరిజనులపై దాడులకు పాల్పడుతున్నారని తెలి పారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదన్నారు.
