Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్.. ప్రముఖ యూనివర్సిటీలతో తెలంగాణ సర్కార్ చర్చలు

గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్.. ప్రముఖ యూనివర్సిటీలతో తెలంగాణ సర్కార్ చర్చలు

హైదరాబాద్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) కీలక అడుగులు వేస్తోంది.

హైదరాబాద్‌లో త్వరలో యూనివర్సిటీ ఆఫ్ లండన్ క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. భారత్ ఫ్యూచర్ సిటీలో ఆఫ్‌షోర్ క్యాంపస్ ఏర్పాటుపై నార్త్‌ఈస్టర్న్ యూనివర్సిటీ పరిశీలించనుంది. ప్రభుత్వ, కార్పొరేట్ ఉన్నతాధికారుల కోసం హైదరాబాద్‌లో షార్ట్‌టర్మ్ కోర్సులు నిర్వహించేందుకు హార్వర్డ్ యూనివర్సిటీ ఆసక్తి చూపుతోంది. తెలంగాణలో ఇండస్ట్రీకి అనుగుణంగా భవిష్యత్తు విద్యా విధానాలను వర్జీనియా టెక్ తీసుకురానుంది.

హైదరాబాద్‌లో కోర్సులు, ఆఫ్‌షోర్ క్లాస్‌రూమ్‌లపై ఎల్‌ఎస్‌ఈ, ఎస్‌ఓఏఎస్ పరిశీలించనుంది. రాష్ట్రంలో షేర్డ్ రీసెర్చ్ సెంటర్లు, సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుపై ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఆసక్తి చూపిస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీల నిపుణులైన అధ్యాపకులతో హైదరాబాద్‌లో ప్రత్యేక ఉన్నత విద్యా కోర్సులు ఏర్పాటు చేయనుంది. ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్, ఎంఐటీ, కేంబ్రిడ్జ్, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్‌తో తెలంగాణ ప్రతినిధులు కీలక చర్చలు జరుపుతున్నారు.

డాక్టర్‌ ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్‌లో త్వరలో షార్ట్‌టర్మ్, ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలు నిర్వహించనుంది. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల తెలంగాణ లక్ష్యానికి ప్రపంచ స్థాయి విద్యాసంస్థల భాగస్వామ్యం ఉపయోగపడనుంది. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో జరిగే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో గ్లోబల్ ఎడ్యుకేషన్‌పై ప్రత్యేక ట్రాక్ ఏర్పాటు చేయనుంది. యువతకు ప్రపంచ స్థాయి విద్య, నైపుణ్యాలు అందించడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

/strong>

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy