Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
GOD: ఆంజనేయస్వామికి విశేష పూజలు

GOD: ఆంజనేయస్వామికి విశేష పూజలు

బొమ్మనహాళ్‌, సెప్టెంబరు1 (ఆంధ్రజ్యోతి): మండలంలోని నేమక ల్లు గ్రామంలో బాలాలయంలో వెలసిన ఆంజనేయ్వస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం మూడో మంగళవారం సం దర్భంగా స్వామివారికి ప్రధాన అర్చకులు అనిల్‌కుమార్‌చార్యులు విశేషపూజలు నిర్వహించారు.

ఉదయం నుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహిం చారు. అలాగే డి. హీరేహాళ్‌ మండలం మురడి గ్రామంలో వెలసిన ఆంజనేయస్వామికి ప్రధాన అర్చకులు పవనకుమార్‌చార్యులు విశేష పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం మూడో మంగళవారం సందర్భంగా భక్తులు వేలాది మంది స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఆలయ ఈవో నరసింహారెడ్డి పర్యవేక్షించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy