Sunday, 26 May, 11.03 am ఆంధ్రజ్యోతి

నవ్య
గోల్డెన్‌ ఫోర్ట్‌!

సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో బంగారు వర్ణంలో మెరిసిపోతుందీ కోట. అందుకే ఈ కోటను సోనార్‌ ఖిలా, గోల్డెన్‌ ఫోర్ట్‌ అని పిలుస్తుంటారు. రాజస్థాన్‌లో ఉన్న జైసల్మేర్‌ కోట విశేషాలు ఇవి.

రాజస్థాన్‌లోని థార్‌ ఎడారిలో ఉన్న అతి పెద్ద కోట ఇది. కోట చుట్టూ ఇళ్లు, దేవాలయాలు, షాపులు, రెస్టారెంట్లతో చిన్న పట్టణం ఉంటుంది.

  • 1156లో రాజ్‌పుత్‌ వంశానికి చెందిన రాజు రావల్‌ జైసల్‌ ఈ కోటను నిర్మించారు. కోట గోడలను పసుపు రంగు ఇసుకరాయితో నిర్మించారు. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో సూర్యకిరణాలు పడి ఆ గోడలు బంగారు వర్ణంలో మెరిసిపోతుంటాయి. అందుకే ఈ కోటను గోల్డెన్‌ ఫోర్ట్‌ అని పిలుస్తారు.
  • 250 అడుగుల ఎత్తులో ఉన్న కోట పట్టణంలో ఎక్కడి నుంచి చూసినా కనిపిస్తుంది. శత్రుదుర్భేద్యంగా నిర్మించిన 30 అడుగుల ఎత్తైన కోట గోడలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. రాజ్‌పుత్‌ శైలిలో నిర్మించిన కోట లోపలి నిర్మాణాల సౌందర్యం చూసి తీరాల్సిందే.
  • జైసల్మేర్‌ ఫోర్ట్‌ను 'త్రికుట్‌ ఘర్‌' అని కూడా పిలుస్తారు. త్రికుట కొండలపై త్రిభుజాకారంలో నిర్మించడంతో ఆ పేరు స్థిరపడింది.
  • పాలరాతితో నిర్మించిన మహారావల్‌ ప్యాలెస్‌ తప్పక చూడాల్సిన ప్రదేశం. రాజులు నివాస మందిరాలుగా ఉపయోగించుకున్న జవహర్‌ ప్యాలెస్‌ నిర్మాణ శైలి ఆకట్టుకుంటుంది. యునెస్కో ఈ కోటను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy
Top