తాత్కాలికంగా నిలిపివేత
జూన్‌లోనే రెండో విడత ప్రారంభం
నిజామాబాద్, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : జిల్లాలో గొల్ల, కుర్మలకు గొర్రెల పంపిణీపై కరోనా ఎఫెక్ట్ పడింది. రెండోవిడత చేపట్టిన కరోనా ఉధృతితో తాత్కాలి కంగా నిలిపివేశారు. గొర్రెలు కొనుగోలు చేసే ఏపీ, మహా రాష్ట్రలో తీవ్రత ఎక్కవగా ఉండడం, వేసవి కావడంతో పం పిణీ తాత్కాలికంగా నిలిపివేశారు. వర్షాలు మొదలై తీవ్రత తగ్గగానే మళ్లీ కొనుగోలు చేసేందుకు నిర్ణయించారు. ఒకటి, రెండు రోజుల్లో ప్రభుత్వం తరపున అధికారులకు కూడా ఉ త్తర్వులను ఇవ్వనున్నారు.
గొల్ల, కుర్మలు ఆర్థికంగా ఆదుకునేందుకు..
ప్రభుత్వం మూడేళ్ల క్రితం గొల్ల, కుర్మలు ఆర్థికంగా అభివృద్ధి చేందేందుకు గొర్రెల పంపిణీ చేపట్టింది.
డీడీలు కట్టినవారు 1104 మంది..
జిల్లాలో రెండోవిడత డీడీలు 1104 మంది కట్టారు. వీరి తో పాటు డీడీలు కట్టి వాపస్ తీసుకున్నవారు 2 వేల మం ది ఉన్నారు. జిల్లాలో అర్హులైన లబ్ధిదారులు 8 వేల మంది ఉన్నారు. వీరందరికీ యూనిట్ కింద 20 గొర్రెలు ఒక పొ ట్టెలును ఇవ్వనున్నారు. వీరంత మూడేళ్లుగా గొర్రెల యూ నిట్ల కోసం ఎదురు చూస్తున్నారు. అధికారులు మాత్రం క రోనాతో గొర్రెల కొనుగోలు చేయలేకపోతున్నామని తెలిపా రు. మహారాష్ట్రలో తీవ్రత ఎక్కువగా ఉండడంతో అక్కడ కొ నుగోలు చేసే పరిస్థితి లేదు. లబ్ధిదారులు ఆందోళన చెంద వద్దని వైరస్ తీవ్రత తగ్గిన తర్వాత కొనుగోలు ఉంటుందని అధికారులు తెలిపారు. రెండు నెలల తర్వాతే జిల్లాలోని గొ ల్ల, కుర్మలకు గొర్రెలు అందనున్నాయి.

