Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి

గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి

డీసీసీ అఽధ్యక్షుడు సనపల అన్నాజీరావు

నూతన కార్యవర్గం నియామకం

రసవల్లి, ఆగస్టు 27(ఆంధ్రజ్యోతి): గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని జిల్లా కాంగ్రెస్‌ (డీసీసీ) అధ్యక్షుడు సనపల అన్నాజీరావు అన్నారు.

ఏఐసీసీ, పీసీసీ ఆమోదించిన జిల్లా కాంగ్రెస్‌ నూతన కార్యవర్గ జాబితాను గురువారం ఇందిరావిజ్ఞాన భవన్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని సీనియర్‌ నాయకులు, పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తున్న వారికి కమిటీలో ప్రాధాన్యం ఇచ్చామన్నారు. రానున్న రోజుల్లో పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేయ డమే లక్ష్యం గా పనిచేస్తామన్నారు.

స్థానిక ఎన్నికల్లో పార్టీ ప్రధాన భూమిక పోషిస్తుందని, ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. అనంతరం నియామక ఉత్తర్వుల కాపీలను సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మంత్రి నర్సింహమూర్తి, కరిమజ్జి మల్లేశ్వర రావు, రెల్ల సురేష్‌, గోవిందు మల్లిబాబు, ఆబో తుల వెంకటనాయుడు, పూడి కిరణ్‌కుమార్‌, ఈశ్వరి, పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy