రాజమండ్రి: సర్ప విగ్రహాన్ని ధ్వంసం చేసిన కేసులో నిందితుడిని మల్కిపురం పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 24న గూడపల్లి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో హుండీ చోరీ జరిగిన విషయం తెలిసిందే. హుండీ చోరీతో పాటు సర్ప విగ్రహాన్ని కూడా నిందితుడు ధ్వంసం చేశాడు. నిందితుడు హుండీని పెకిలించే క్రమంలో విగ్రహం ధ్వంసమైనట్లు అమలాపురం డీఎస్పీ వై.మాధవరెడ్డి వెల్లడించారు.
