శాన్ రమన్ : టెక్నాలజీ దిగ్గజం గూగుల్ హార్డ్‌వేర్‌లో తన సత్తా చాటుకోవడం కోసం తక్కువ ధరలో అత్యున్నత సామర్థ్యం గల స్మార్ట్‌ఫోన్లు, కొత్త తరం గూగుల్ క్రోమ్‌కాస్ట్ ఆవిష్కరించింది. త్వరలోనే ఈ రెండు ఉత్పత్తులు మార్కెట్లో ప్రవేశించనున్నాయి. ఈ రెండు ఉత్పత్తులతో పాటు 99 డాలర్ల ధరలో (రూ.7425) ఒక స్పీకర్‌ను కూడా గూగుల్ ఆన్‌లైన్‌లో ప్రదర్శించింది.
స్మార్ట్‌ఫోన్లు : గూగుల్ ఆవిష్కరించిన వాటిలో పిక్సెల్ 5, పిక్సెల్ 4ఏ స్మార్ట్‌ఫోన్లున్నాయి. పిక్సెల్ 5ధర 700 డాలర్లు (రూ.52,500) ఉండవచ్చు. అలాగే 4ఏ పిక్సెల్ సామర్థ్యం గల స్మార్ట్‌ఫోన్ ధర 500 డాలర్లు (రూ.37,500).
కొత్త క్రోమ్‌కాస్ట్ : ఆన్‌లైన్ వీడియో స్ర్టీమింగ్‌కు బహుళ ప్రాచుర్యంలో ఉన్న క్రోమ్‌కా్‌స్టలో కొత్త డివై్‌సను ఆవిష్కరించింది.
దీని ధర 50 డాలర్లు (రూ.3750).
కొత్త స్పీకర్ : మరింత అధిక ధ్వని సామర్థ్యంతో ఒక కొత్త స్పీకర్‌ను ఆవిష్కరించింది. ధర 99 డాలర్లు (రూ.7425).

