Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

గులాబీ పార్టీలో చేరిన టీడీపీ నేత

సిద్దిపేట: సిద్దిపేట టీడీపీ జిల్లా అధ్యక్షుడు గుండు భూపేశ్ సహా వివిధ పార్టీల నాయకులు మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్‌ పార్టీలో చేరారు. మంత్రి హరీష్‌ రావు స్వయంగా వారందరికీ పార్టీ కండువాలు కప్పటి గులాబీ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో టిడిపినీ ప్రజలు ఆదరించరని ఆ పార్టీ నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. నేటితో సిద్దిపేటలో టిడిపి ఖాళీ అయిందని రాష్ట్రం ఏర్పడ్డాక పెను మార్పులు వచ్చాయని హరీష్ అన్నారు. జిల్లాలో గోదావరి జలాలతో 1600 కోట్ల రూపాయల విలువ గల పంటలు పండుతున్నాయని, ఒకనాడు కాలం కాక కరువుతో పట్టణంలో అంబలి కేంద్రం ఏర్పాటు పెట్టుకునేవాళ్లమని, నేడు పసిడి పంటలు పండుతున్నాయని హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy