Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుతపులికి తీవ్ర గాయాలు

గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుతపులికి తీవ్ర గాయాలు

నాసిక్ (మహారాష్ట్ర): వేగంగా వచ్చిన ఓ గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుతపులి తీవ్రంగా గాయపడిన ఘటన మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో జరిగింది. ఓ చిరుతపులి నాసిక్ జిల్లా అటవీప్రాంతంలో రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో చిరుతపులి తీవ్రంగా గాయపడింది. నాసిక్ జిల్లా అటవీశాఖ అధికారులు హుటాహుటిన వచ్చి గాయపడిన చిరుతపులిని పునరావాస కేంద్రానికి తరలించి పశువైద్యులతో చికిత్స చేపిస్తున్నారు. వాహనం గట్టిగా ఢీకొనడంతో చిరుతపులికి తీవ్ర గాయాలయ్యాయని, దీని పరిస్థితి విషమంగా ఉందని అటవీశాఖ అధికారులు చెప్పారు.ఫిబ్రవరి నెలలో పాల్ఘార్ జిల్లాలోని జాతీయ రహదారిపై ఓ వాహనం ఢీకొని ఓ చిరుతపులి మరణించింది.

అటవీప్రాంతంలోని రోడ్లపై రాత్రివేళ వన్యప్రాణులు రోడ్డు దాటుతుండగా ప్రమాదాలకు గురవుతున్నాయి. రాత్రివేళ వాహనాలు వేగంగా వెళుతుండటంతో వన్యప్రాణులు ప్రమాదాల బారిన పడుతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy