మంత్రి కొప్పుల
రాష్ట్రంలోని గురుకులాలను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలంటూ అధికారులకు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. అన్ని వర్గాల వారిని ఉన్నత విద్యావంతులను చేయాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్.. గురుకుల పాఠశాలలు నెలకొల్పారన్నారు.
గతంలో గురుకులాలు పేరుకు మాత్రమే ఉండేవని, ప్రస్తుతం మౌలిక సదుపాయాలను పెంచుకోవడంతోపాటు నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్నాయన్నారు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ బోర్డు సమావేశాన్ని సంక్షేమ భవన్‌లో గురువారం నిర్వహించారు.
