Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గ్యాస్ సమస్యతో ఇబ్బందా..? వాము, సోంపుతో సింపుల్ ట్రీట్మెంట్

గ్యాస్ సమస్యతో ఇబ్బందా..? వాము, సోంపుతో సింపుల్ ట్రీట్మెంట్

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత జీవనశైలిలో జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, సమయానికి భోజనం చేయకపోవడం, అధిక ఒత్తిడి వంటి కారణాలతో చాలామంది గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.

చిన్న చిన్న కడుపు సమస్యలకు ప్రతిరోజూ మందులు తీసుకోవడం కంటే, కొన్ని సహజమైన ఆయుర్వేద చిట్కాలను పాటిస్తే ఉపశమనం పొందవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

వాము - నల్ల ఉప్పు

వాము జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఎంతో సహాయపడుతుంది. అర టీస్పూన్ వాములో కొద్దిగా నల్ల ఉప్పు కలిపి గోరువెచ్చని నీటితో తీసుకుంటే గ్యాస్, అజీర్ణం, కడుపు నొప్పి తగ్గుతాయి. భోజనం తర్వాత తీసుకుంటే ఇంకా మంచిది.

సోంపు నీరు

సోంపు.. జీర్ణక్రియను సులభం చేస్తుంది. ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ సోంపు వేసి మరిగించి తాగితే గ్యాస్, గుండెల్లో మంట, కడుపు బరువుగా అనిపించడం తగ్గుతాయి.

అల్లం - నిమ్మరసం

అల్లం జీర్ణక్రియను వేగంగా జరిగేలా చేస్తుంది. చిన్న అల్లం ముక్కకు కొద్దిగా నిమ్మరసం, నల్ల ఉప్పు కలిపి తింటే గ్యాస్, అజీర్ణం తగ్గుతాయి. భోజనం ముందు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఇంగువ

ఇంగువను గ్యాస్ సమస్యలకు మంచి మందుగా ఆయుర్వేదం చెబుతుంది. గోరువెచ్చని నీటిలో చిటికెడు ఇంగువ కలిపి తాగితే కడుపులో గ్యాస్ తగ్గుతుంది. పప్పులు, కూరల్లో కూడా ఇంగువ వాడితే జీర్ణం సులభంగా జరుగుతుంది.

తిన్న వెంటనే పడుకోకండి

భోజనం చేసిన వెంటనే పడుకోవడం వల్ల గ్యాస్, అజీర్ణం సమస్యలు పెరుగుతాయి. తిన్న తర్వాత కనీసం 10-15 నిమిషాలు నెమ్మదిగా నడిస్తే ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. రాత్రి భోజనం కూడా తేలికగా, సమయానికి చేయడం మంచిది. గ్యాస్ సమస్య తరచుగా వస్తూ ఉంటే లేదా తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, మలబద్ధకం వంటి సమస్యలు ఉంటే వైద్యులని సంప్రదించడం మంచిది.

Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

సిగరెట్లు తాగకపోయినా పెదాలు నల్లగా ఉన్నాయా? ఈ చిట్కాలు ట్రై చేయండి

రాగి బాటిల్‌లో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు మాత్రం చేయొద్దు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy