Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్ టూ షిర్డీ.. IRCTC స్పెషల్ టూర్..

హైదరాబాద్ టూ షిర్డీ.. IRCTC స్పెషల్ టూర్..

ఇంటర్నెట్ డెస్క్: షిర్డీ సాయిబాబా భక్తులకు ఐఆర్‌సీటీసీ శుభవార్త అందించింది. హైదరాబాద్ నుంచి షిర్డీకి ప్రతి వారం ప్రత్యేక రైలు ద్వారా మూడు రోజుల యాత్ర ప్యాకేజీని ప్రకటించింది.

తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన ప్రయాణం, షిర్డీ దర్శనం కల్పించేలా ఈ ప్యాకేజీని రూపొందించారు.

ఈ యాత్రకు 'సాయి సన్నిధి' పేరుతో ప్యాకేజీని అందిస్తున్నారు. ప్రతి బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్‌ నుంచి రైలు బయల్దేరుతుంది. ప్రయాణికుల సౌకర్యం కోసం స్లీపర్ క్లాస్‌తో పాటు థర్డ్ ఏసీ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది.

IRCTC షిర్డీ ప్యాకేజీ ధరలు

థర్డ్ ఏసీ (కంఫర్ట్ కేటగిరీ):

  • సింగిల్ ఆక్యుపెన్సీ: రూ.7,920

  • డబుల్ ఆక్యుపెన్సీ: రూ.6,700

  • ట్రిపుల్ ఆక్యుపెన్సీ: రూ.6,690

  • 5-11 ఏళ్ల పిల్లలకు (బెడ్‌తో): రూ.6,080

  • 5-11 ఏళ్ల పిల్లలకు (బెడ్ లేకుండా): రూ.5,050

స్లీపర్ క్లాస్:

  • సింగిల్ ఆక్యుపెన్సీ: రూ.6,370

  • డబుల్ ఆక్యుపెన్సీ: రూ.5,100

  • ట్రిపుల్ ఆక్యుపెన్సీ: రూ.5,100

  • 5-11 ఏళ్ల పిల్లలకు (బెడ్‌తో): రూ.4,390

  • 5-11 ఏళ్ల పిల్లలకు (బెడ్ లేకుండా): రూ.3,360

యాత్ర షెడ్యూల్ ఇలా ఉంటుంది

  • బుధవారం సాయంత్రం 6.30 గంటలకు కాచిగూడ నుంచి అజంతా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం ప్రారంభమవుతుంది. మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు మహారాష్ట్రలోని నాగర్‌సోల్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఐఆర్‌సీటీసీ సిబ్బంది భక్తులను షిర్డీలోని వసతి ప్రాంతానికి తీసుకెళ్తారు.

  • అనంతరం భక్తులు షిర్డీ సాయిబాబా ఆలయాన్ని దర్శించుకోవచ్చు. సాయంత్రం 5 గంటలకు తిరుగు ప్రయాణం ప్రారంభమై, రాత్రి 8.30 గంటలకు రైలు బయల్దేరుతుంది. ప్రయాణం పూర్తయ్యాక శుక్రవారం ఉదయం 9.45 గంటలకు తిరిగి కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు.

  • ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం సికింద్రాబాద్‌లోని ఐఆర్‌సీటీసీ సౌత్ సెంట్రల్ జోన్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. అలాగే 040-27702407, 9701360701 నంబర్లలో సమాచారం పొందవచ్చని అధికారులు తెలిపారు.

Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

ఫ్రిజ్ లేకుండానే టమోటాలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా?

ఈ తేదీల్లో పుట్టినవారిది రాజసమైన వ్యక్తిత్వం..!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy