Dailyhunt
హైదరాబాద్‌లో కరోనా కట్టడికి జీహెచ్‌ఎంసీ యాక్షన్ ప్లాన్

హైదరాబాద్‌లో కరోనా కట్టడికి జీహెచ్‌ఎంసీ యాక్షన్ ప్లాన్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా నివారణకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్-19 వ్యాప్తిని నియంత్రించేందుకు కఠిన చర్యలతోపాటు రాత్రి పూట 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కూడా అమలు చేస్తోంది. ఇక హైదరాబాద్‌లో పెరుగుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల కట్టడికి జీహెచ్‌ఎంసీ కఠిన చర్యలు చేపట్టింది. కరోనా కట్టడికి జీహెచ్‌ఎంసీ యాక్షన్ ప్లాన్ అమలు చేయనుంది. హైదరాబాద్ పరిధిలో 63 కంటైన్మెంట్ జోన్ల ఏర్పాటు చేయనుంది. పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టింది. కట్టుదిట్టంగా కంటైన్‌మెంట్ జోన్లను అమలు చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy