Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్‌లో ప్రమాదం.. కారు ఢీకొని బాలుడి మృతి

హైదరాబాద్‌లో ప్రమాదం.. కారు ఢీకొని బాలుడి మృతి

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. కారు ఢీకొని ఇజాన్ ఉద్దీన్ అనే మూడేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు.

బాలుడు రోడ్డు దాటుతుండగా XUV (AP11AN6899) నంబర్ గల కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. దంపతులు తమ కొడుకుతో కలిసి ఐఎస్ఎన్ సదన్ ఎక్స్ రోడ్డు వద్ద ఫ్యూజన్ సిక్స్ వద్ద ఓ హోటల్‌కి వచ్చారు. తల్లిదండ్రులు హోటల్లో భోజనం చేస్తుండగా.. బాలుడు సడన్‌గా రోడ్డు పైకి వచ్చాడు. ఈ క్రమంలో అటుగా వస్తున్న బైకర్.. బాలుడిని గమనించి బ్రేక్ వేశాడు. అయితే ఆ వెంటనే మరో వైపు నుంచి వచ్చిన కారు.. బాలుడిని బలంగా ఢీకొంది. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్.. వాహనాన్ని ఆపాడు. తీవ్ర గాయాలపాలైన బాలుడిని ఆస్పత్రికి తరలించారు.

అయితే, అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనా స్థలాన్ని యాకత్‌పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ సందర్శించారు. ఐఎస్ సదన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఈ వార్తలు కూడా చదవండి..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy