4,062 నుంచి 3,995కు.. హేతుబద్ధీకరణలో భాగంగా నిర్ణయం
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్‌లో పోలింగ్ కేంద్రాల సంఖ్య తగ్గింది. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో ప్రస్తుతం 4,062 పోలింగ్ కేంద్రాలు ఉండగా..
హేతుబద్ధీకరణలో భాగంగా 3,995కు తగ్గించారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1200లోపు ఓటర్లు ఉండాలి. నగరంలోని నాలుగు కేంద్రాల్లో 1200 కంటే ఎక్కువ ఓటర్లు ఉండగా.. 71 ప్రాంతాల్లో 800 నుంచి 1000 మంది ఓటర్లు ఉన్నారు.
ఈ నేపథ్యంలో తక్కువ ఓటర్లు ఉన్న కేంద్రాలను విలీనం చేస్తూ, ఎక్కువ ఓటర్లు ఉన్న చోట కొత్త పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో 71 పోలింగ్ కేంద్రాల విలీనం జరుగగా నాలుగు కొత్త కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. 94 కేంద్రాల లొకేషన్ మార్చినట్టు జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వీ కర్ణన్ తెలిపారు.
యాకుత్‌పురా నియోజకవర్గంలో అత్యధికంగా 41 పోలిగ్ కేంద్రాలు విలీనం కాగా.. బహదూర్‌పురాలో ఎనిమిది, మలక్‌పేటలో 7, ముషీరాబాద్‌లో 5, సికింద్రాబాద్‌లో 4, నాంపల్లి, చార్మినార్‌లో మూడు చొప్పున పోలింగ్ కేంద్రాల విలీనం జరిగింది. మొత్తంగా జిల్లా పరిధిలో 67 పోలింగ్ కేంద్రాలు తగ్గాయి. ప్రస్తుత ఓటర్ జాబితాలోని 47.36 లక్షల ఓటర్ల సంఖ్య ఆధారంగానే పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ జరిగిందని కర్ణన్ చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:

