Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో 11గంటల నుంచి పవర్ కట్

హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో 11గంటల నుంచి పవర్ కట్

చిక్కడపల్లి(హైదరాబాద్): ఫీడర్ల మరమ్మతు కారణంగా అజామాబాద్‌, హైదరాబాద్‌ సిటీ-1 డివిజన్ల పరిధిలో మంగళవారం పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నామని సీబీడీఏడీఈలు జి.

నాగేశ్వరరావు, డి. వినోద్‌కుమార్‌ తెలిపారు. అజామాబాద్‌ ఫీడర్‌ పరిధిలో ఉదయం 11 నుంచి 11.30 గంటల వరకు, సిటీ సెంట్రల్‌ లైబ్రరీ పరిధిలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌ పరిధిలో ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు,

 అజామాబాద్‌ ఐఈ పరిధిలో మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వరకు, గగన్‌మహల్‌ పరిధిలో మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు, గోశాలపరిధిలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, ఆర్‌వోఎమ్‌ పరిధిలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్‌ సరఫరా ఉండదని సీబీడీఏడీఈలు పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

ఎస్‌ఐఆర్‌ డిజిటలైజేషన్‌ పూర్తి చేయాలి

2.25 లక్షల కొత్త పింఛన్లు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy