Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్‏ను కాపాడుకుందాం..!

హైదరాబాద్‏ను కాపాడుకుందాం..!

  • విపరీతంగా పెరుగుతున్న హీట్‌ ఐలాండ్స్‌

  • మొక్కలు నాటితేనే భవిత

  • నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం

హైదరాబాద్‌ సిటీ: అత్యాశకు పోతున్న మనిషి చేస్తున్న విధ్వంసం కారణంగా ఎదురవుతున్న తీవ్ర పరిణామాలకు ఇప్పుడు ఆ మానవుడే ఇబ్బందులు పడుతున్నాడనడానికి హైదరాబాద్‌ నగరమే ఓ ఉదాహరణ.

చెరువులు కుచించుకుపోయాయి. ఎక్కడ చూసినా ఆకాశహర్మ్యాలే దర్శనమిస్తున్నాయి. సమశీతోష్ణ స్థితి వాతావరణం చూడాలంటే హైదరాబాద్‌కు వెళ్లాల్సిందేనని ఒకప్పుడు అనే వారు. కానీ ఇప్పుడిక్కడ ఉక్కబోత, వేడిగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అర్బన్‌ హీట్‌ ఐల్యాండ్స్‌తో ఎన్నడూ లేనంతగా నగరంలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటమే కాదు.. రాత్రి పూట కూడా వేడిగాలులు విజృంభించడం రాబోతున్న విధ్వంసానికి సూచికలని పర్యావరణ ప్రేమికులు హెచ్చరిస్తున్నారు. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నగరంలోని పరిస్థితులపై ప్రత్యేక కథనం..

అద్దాల మేడలు.. హీట్‌ ఐల్యాండ్‌లు..

నగరంలో ఆకాశహర్మ్యాలు గణనీయంగా పెరిగాయి. హైరైజ్‌ భవంతులకూ ప్రభుత్వాలు ఇబ్బడిముబ్బడిగా అనుమతిలిచ్చేస్తున్నాయి. దీనివల్ల పర్యావరణానికి నష్టమని పర్యావరణ ప్రేమికులు వాపోతున్నారు. హైదరాబాద్‌ అభివృద్ధి చెందుతున్న తీరు నిస్సందేహంగా వినాశకరమనే చెప్పక తప్పదన్నారు యునైటెడ్‌ వే ఆఫ్‌ హైదరాబాద్‌లో వలంటీర్‌, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రమణ. అద్దాల మేడలు విద్యుత్‌ పరంగా ఖర్చును తగ్గిస్తాయి అని చెబుతుంటారు కానీ, పర్యావరణానికి నష్టం కలిగిస్తాయని పేర్కొన్నారు. నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (నీరి) అధ్యయనాల ప్రకారం అద్దాల మేడల వల్ల చుట్టుపక్కల ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు కనిష్ఠంగా 2 డిగ్రీలు, గరిష్ఠంగా 10 డిగ్రీల సెల్సియస్‌ పెరుగుతాయట. కారణం హీట్‌ రిఫ్లెక్షన్‌. అద్దాల మేడలను అర్బన్‌ హీట్‌ ఐల్యాండ్స్‌గా పేర్కొంటున్నారు రమణ. పది సంవత్సరాల క్రితం హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌ వాతావరణాన్ని ఇప్పుడు పోల్చి చూస్తే తేడా మీకే తెలుస్తుందన్నారు.

వివిధ ప్రాంతాల్లో..

అర్బన్‌ హీట్‌ ఐల్యాండ్స్‌ ఇప్పుడు పశ్చిమాన గచ్చిబౌలి మొదలు దక్షిణాన మైలార్‌దేవపల్లి వాయువ్యంలో బండ్లగూడ, పటాన్‌చెరు, ఆగ్నేయంలో బీఎన్‌ రెడ్డి నగర్‌, హయత్‌ నగర్‌ వరకూ విస్తరించి ఉన్నాయి. పదేళ్లకోమారు 0.75 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతున్నాయని గతంలో అధ్యయనాలు చెబుతున్నాయి కానీ, తగ్గిన భూగర్భ జలాలు, పెరుగుతున్న ఆకాశహర్య్మాల కారణంగా ఇది ఒక డిగ్రీ కంటే అధికంగానే ఉంటుందని ఈ సంవత్సరపు ఎండలు చూసిన తరువాత అనుకోక తప్పడం లేదన్నారు. అర్బన్‌ హీట్‌స్ట్రెస్‌ ట్రాకర్‌ నివేదిక ప్రకారం గచ్చిబౌలి, కోకాపేట వంటి హై రైజ్‌ బిల్డింగ్‌లు ఉన్న ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత చుట్టు పక్కల గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే దాదాపు రెండు డిగ్రీల సెల్సియస్‌ అధికంగా ఉంటున్నాయి. గత పదేళ్లలో గాలిలో తేమ 10ు కంటే ఎక్కువగానే పెరగడం వల్ల ఉక్కబోత కూడా పెరిగిందంటున్నారు.

 గ్రీన్‌ హైదరాబాద్‌ వైపు..

నగరంలోని రాళ్ల గుట్టలు నీటి ప్రవాహాన్ని క్రమబద్దీకరించేవి. ఖాజాగూడ, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్‌... మనకు ఆ రాళ్లగుట్టలెక్కడైనా కనబడుతున్నాయా అని నిర్వేదంగా ప్రశ్నించారు సొసైటీ టు సేవ్‌ రాక్‌ సభ్యుడైన ఆనంద్‌. పూర్వీకులు మనకు అందించినట్లుగా ప్రకృతిపరంగా ఆహ్లాదకరమైన హైదరాబాద్‌ను భావితరానికి అందించాలంటే ప్రభుత్వంతో పాటుగా ప్రజలు కూడా కొన్ని మార్గాలను అనుసరించాలంటున్నారు పర్యావరణ ప్రేమికులు రమణ, ఆనంద్‌. ప్రకృతి సహజసిద్ధంగా ఇచ్చిన గుట్టలు, చెరువుల నుంచి స్ఫూర్తిని పొంది పర్యావరణ పరిరక్షణను జీవితంలో ఓ భాగంగా చేసుకుంటూ గ్రీన్‌ హైదరాబాద్‌ వైపు అడుగులు వేద్దామని పిలుపునిస్తున్నారు.

హైదరాబాద్‌ను కాపాడుకోవాలంటే..

విదేశీ అలంకరణ చెట్లకంటే దేశవాళీ రావి, వేప, మర్రి, చింత చెట్లను నగర వీధుల్లో పంచడం వల్ల ఆక్సిజన్‌ లభిస్తుంది. పక్షులకు ఆవాసమూ కలుగుతుంది. నగరాన్ని స్పాంజ్‌ సిటీగా మలచాలి. రోడ్లపై నీరు నిలవ లేకుండా ప్రతి చుక్కా భూమిలో ఇంకిపోయే ఏర్పాట్లు చేయాలి. చెరువుల కబ్జాపై హైడ్రా తమ కఠిన చర్యలను తీసుకోవడం కొనసాగించాలి. గ్రీన్‌ బిల్డింగ్‌ నిబంధనలు అమలయ్యేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. గేటెడ్‌ కమ్యూనిటీలు, ఐటీ కంపెనీలు సహా ప్రతి చోటా కనీసం 30ు భూమి పచ్చదనానికి కేటాయించాలనే నిబంధన తీసుకురావాలి. గ్లాస్‌ బిల్డింగ్స్‌కు మన వాతావరణానికి తగవు. వాటికి బదులుగా కూల్‌ రూఫ్స్‌. టెర్రస్‌ గార్డెన్స్‌, వర్టికల్‌ గ్రీనరీ అవకాశాలను ఐటీ కంపెనీలు అనుసరించేలా నిబంధనలు తీసుకురావాలి.

/span>

'బంగారం'లాంటి కట్టుకథ!

తాజా నిబంధనల మేరకే పదోన్నతులు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy