Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హరియాణా, మహారాష్ట్రల్లో పోలైన, లెక్కించిన ఓట్లలో తేడా!

హరియాణా, మహారాష్ట్రల్లో పోలైన, లెక్కించిన ఓట్లలో తేడా!

  • 51 ఎమ్మెల్యే/ఎంపీ స్థానాలపై

  • 'ది రిపోర్టర్స్‌ కలెక్టివ్‌' కథనం

న్యూఢిల్లీ, నవంబరు 11: హరియాణా, మహారాష్ట్రల్లో 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్‌, ఇతరత్రా అక్రమాలు జరిగాయని పరిశోధనాత్మక జర్నలిస్టుల గ్రూపు 'ది రిపోర్టర్స్‌ కలెక్టివ్‌' సంచలన కథనం ప్రచురించింది.

ఈ రెండు రాష్ట్రాల్లో కొన్ని స్థానాల్లో ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని.. ఓటర్లు వేసిన ఓట్లకు, ఈవీఎంలలో లెక్కించిన ఓట్లకు వ్యత్యాసం ఉందని మంగళవారం తన కథనంలో పేర్కొంది. ఈ రెండు రాష్ట్రాలతో పాటు జమ్మూకశ్మీరులోని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల అంతర్గత ఎన్నికల రికార్డులను ఈ గ్రూపు పరిశీలించింది. 51నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు తేడా ఉందని పేర్కొంది. వీటిలో 32నియోజకవర్గాల్లో ఈ రెండు లెక్కల నడుమ వ్యత్యాసం కనిపించగా.. మిగతా 19 స్థానాల్లో.. పోలింగ్‌ కేంద్రాల్లోకి ప్రవేశించిన ఓటర్ల సంఖ్యను ఎన్నికల అధికారులు సున్నాగా నమోదుచేశారని తెలిపింది. ఈ కథనాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్‌(ఈసీ) ఖండించింది. దీనిపై బుధవారం వివరణ ఇస్తూ.. అందులో పేర్కొన్న గణాంకాలను తప్పులతడకలుగా పేర్కొంది. సదరు స్థానాల్లో మొత్తం రిజిస్టరైన ఓటర్ల సంఖ్యను పోలైన ఓట్లుగా సదరు కథనంలో పొరబడ్డారని తెలిపింది.

హరియాణాలోని బడ్ఖల్‌ అసెంబ్లీ స్థానం ఓట్ల లెక్కలను ఇందుకు ఉదాహరణగా చూపింది. 'ఇక్కడ 3,32,253 ఓట్లు పోలైనట్లు కథనంలో పేర్కొన్నారు. కానీ 1,60,553 మంది మాత్రమే (48.32శాతం ఓటింగ్‌) ఓట్లేశారు. తిరస్కరించిన పోస్టల్‌ బ్యాలెట్లు, చెల్లుబాటుకాని ఓట్లు, నోటా ఓట్లను తీసివేయగా.. మిగతా చెల్లుబాటైన ఓట్ల సంఖ్య 1,58,475. ముంబై నార్త్‌ లోక్‌సభ నియోజకవర్గంలో కూడా 18.11 లక్షల మంది రిజిస్టర్డ్‌ ఓటర్లు ఉన్నారు. వీరంతా ఓట్లేసినట్లు కథనంలో చూపించారు. వీరిలో 10.33 లక్షల మంది మాత్రమే ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇక్కడ పోలింగ్‌ 57శాతం నమోదైంది. తిరస్కరించిన ఓట్లు, నోటా ఓట్ల్లను తీసివేసిన తర్వాత లెక్కించే ఓట్లనే తుది గణాంకాలుగా పరిగణించాలి. పోలింగ్‌ కేంద్రాల్లోకి ప్రవేశించేవారి సంఖ్య, పోలైన ఓట్ల సంఖ్యలో తేడా ఎందుకు వస్తుందంటే.. కొందరు ఓటర్లు బూత్‌లలోకి వచ్చినా ఓట్లేయరు' అని వివరించింది. కాగా.. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో నమోదైన ఓట్లకు సంబంధించిన 17సీ వంటి డాక్యుమెంట్ల నిర్వహణ తీరును 'ది రిపోర్టర్స్‌ కలెక్టివ్‌' ప్రశ్నించింది. అంతర్గత ఎన్నికల రికార్డులను బహిరంగపరచాలని కోరింది.

/span>

వివాహేతర బంధంపై అభ్యంతరం.. ప్రియుడితో కలిసి కుమారుడిని చంపిన తల్లి

దీపావళి వస్తేనే కాలుష్యం గుర్తుకొస్తోందా.. సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Andhrajyothy